hamsakalam.com
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:46 pm Digital Edition : HAMSA Kalam varta telugu Dina Patrika

అన్నదానమే మహాదానం.. హోప్ ఫౌండేషన్ సేవా యజ్ఞం

అన్నదానమే మహాదానం.. హోప్ ఫౌండేషన్ సేవా యజ్ఞం

 

(ఆగస్ట్-8- హింస కలంవార్త )

 

196వ వారం 3,200 మందికి అన్న ప్రసాదం.. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాం: కొండ విజయ్ కుమార్

చందానగర్:

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరంతర అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా 196వ అన్నదాన కార్యక్రమాన్ని శనివారం గంగారంలోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్తో పాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొని భక్తులు, ప్రజలకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.

ఈ వారంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి సుమారు 3,200 మంది హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పేదలు, నిరుపేదలు, ఆకలితో ఉన్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఆకలితో ఉన్న వారికి కడుపునిండా అన్నం పెట్టి వారి ఆకలిని తీర్చడం ద్వారా తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో అన్నదానం ఎంతో గొప్పదని, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవసరమైన వారికి సహాయం చేయడమే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని అన్నారు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు, సేవా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.