నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం:
ప్రయివేట్ ఆర్ టి సి బస్సు లను, మరియు భారీ లారీల ను, ట్రిప్పర్ లను వాటి స్పీడ్ ను నియంత్రించాలి
హంస కలం వార్త,
తెలుగు దినపత్రిక .. 05 – ఫిబ్రవరి -26-
*రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు*
*బందెల ఓబులేసు*
*డిమాండ్.*
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కోయిలకుంట్ల నుండి నంద్యాల కు వెళ్తున్న ప్రయివేట్ ఆర్ టి సి బస్సు ల డ్రైవర్ ల స్పీడ్ ను నియంత్రించాలి, అదే విధంగా వారి పైన ఒత్తిడి ని తగ్గించాలి. అని బందెల ఓబులేసు ఆర్ టి సి, ఆర్. ఎం, మరియు , ఆర్. టి. ఓ. అధికారులు ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఇటు కోయిలకుంట్ల నుండి నంద్యాలకు నంద్యాల నుండి కోయిలకుంట్ల తరచుగా కొన్ని వేల మంది ప్రయాణాలు చేస్తుంటారు అందులో భాగంగా కోయిలకుంట్ల నుండి నంద్యాలకు హైవే రోడ్డు పనులు జరుగుతా ఉండగా రోడ్డు మరమ్మత్తులు భాగంగా దుమ్ముకు ధూళికి వెలువడిన గుంతలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా ఉండగా ఆర్టీసీ ప్రైవేటు బస్సుల డ్రైవర్లు మరియు భారీ లోడ్ తో లారీలు మితిమీరిన స్పీడుతో పోవడంతో గుంతలున్న ప్రదేశంలో కలవర్టు నిర్మిస్తున్న ప్రదేశంలో దుమ్ము ఎక్కువ ఉండడంతో బైకుల మీద వెళ్లేవాళ్లు ట్రాక్టర్లు లో, ఆటలలో, కూలి పనులకు నిమిత్తం వెళ్లేవాళ్లు ఆ యొక్క దుమ్ముకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు బస్సుల డ్రైవర్ల పైన సమయపాలన ఒత్తిడి కి గురి చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించమని తక్కువ సమయానికి ఎక్కువ స్పీడుతో ప్రయాణం చేసే విధంగా జరుగుతుండడంతో చిన్నచిన్న ప్రమాదాలతో పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు ల కు,గురవుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు రోడ్డుకిరువైపులా పనులు జరుగుతుండడంతో భారీ భారీ వాహనాలు లారీలు అయితే, వీర విహారం చేస్తూ స్పీడ్ తో చక్కర్లు కొడుతూ అదేవిధంగా ఆర్టీసీ బస్సులు నిత్యం తిరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సంబంధిత ఆర్ టి ఓ అధికారులు చొరవ తీసుకొని అటు ఆర్టీసీ ఆర్. టి. సి, ఆర్. ఎం. అధికారులు బస్సులను భారీ లోడ్ తో వున్న లారీల ను, నెమ్మదిగా వెళ్లడానికి తగు సూచనలు ఇవ్వవలసినదిగా, అనుమతి లేకుండా నడుపుతూన్న వాటి పైన చర్యలు తీసుకొని వాటిని గుర్తించి సీజ్ చేయాలనీ రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోయిలకుంట్ల నుండి నంద్యాల వరకు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠశాల సమయానికి ఆర్ టి సి బస్సులు ను నడపవలసిందిగా అధికారులను డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు నేపథ్యంలో పురుషులకు చిన్న పిల్లలకు వికలాంగులకు వృద్ధులకు మెరుగైన సౌకర్యం బస్సులలో కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో ఎం ఆర్ పి ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అరదేశీ రమేష్, ఆర్ ఎస్ ఏ నాయకులు సమీర్, జాఫర్, జగన్, వలి, శ్యాం,సద్దాం సుమంత్, ప్రదీప్ లు ఫాల్గొన్నారు



